వింజమూరులోని ప్రసన్నరెడ్డి నగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, శుక్రవారం అన్నపూర్ణ దేవి అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.