ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నియోజకవర్గంలోని 8 మండలాల కన్వీనర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ గౌరవాన్ని కాపాడాలని వారు కోరారు.