
సీతారాంపురం బావిలో మహిళ మృతదేహం లభ్యం
నెల్లూరు జిల్లా సీతారామపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక పొలాల బావిలో ఆదివారం ఆకుల భాగ్యమ్మ (40) అనే మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గ్రామస్తులు, బంధువులు ఆమె మృతికి కుటుంబ కలహాలే కారణమని ఆరోపిస్తున్నారు.







































