అనంతపురం శివారులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రేపు జరగనున్న తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 1,268 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీరిలో 480 మంది స్నాతక, 788 మంది స్నాతకోత్తర
విద్యార్థులు ఉన్నారు. 11 రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 56 విశ్వవిద్యాలయ స్వర్ణ పతకాలు, 8 దాతృత్వ స్వర్ణ పతకాలు కూడా ఈ సందర్భంగా బహూకరించనున్నారు.