వజ్రకరూరు మండలం ఆర్డీటీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను సర్పంచ్ మల్లెల జగదీష్ ఆదివారం అందజేశారు. పాస్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని, గ్రామ యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ సూచించారు.