అనంతపురం జిల్లా కేంద్ర విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవానికి విచ్చేసిన
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాబును సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్ మర్యాదపూర్వకంగామంగళవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయాలి' అని సూచించారు.