అనంతపురం నగరంలో దొంగ నోట్ల తయారీ వ్యవహారం కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద నగర్‌లో ఓ ఇంటిలో దొంగ నోట్లను ముద్రిస్తున్న అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులను గురువారం విజయవాడ పోలీసులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముద్రణ యంత్రాలు, లాప్టాప్, సెల్ ఫోన్లు, ముద్రించిన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.