
విజయ సాయికుమార్ కి స్వామి వివేకానంద ఇన్స్పిరేషనల్ అవార్డు
రాజమండ్రికి చెందిన పాన్ ఇండియా వారు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో అందించే స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ అవార్డును అనంతపురంకు చెందిన సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్ ప్రకటించారు. ఈ అవార్డు తనకు రావడం పట్ల డా. విజయ సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. పలువురు నగర ప్రముఖులు, సాహితీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.






































