చెన్నేకొత్తపల్లి: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని వాహనదారుడు దుర్మరణం

2412చూసినవారు
చెన్నేకొత్తపల్లి: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని వాహనదారుడు దుర్మరణం
సీకేపల్లి మండలం కోన క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సోమశేఖర్ (36) అనే యువకుడు దుర్మరణం చెందాడు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో, రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సోమశేఖర్ మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్