చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి 44పై శనివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారి విభాగినిని ఢీకొని బోల్తా పడటంతో చోదకుడు మాడెం ఓబి రెడ్డి(60) మృతి చెందారు. వ్యక్తిగత పనిపై పెనుకొండ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి తల్లి, భార్య ఉన్నారు.