ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో బుధవారం తెల్లవారుజామున నారాయణస్వామి అనే దొంగ మృతి చెందాడు. దొంగతనం కోసం వచ్చిన అతన్ని స్థానికులు వెంబడించగా, రైల్వే పట్టాలు దాటే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు బళ్లారి వాసి అని ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు.