ధర్మవరంలోని కొత్తపేటలో, భార్య శాంభవి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానించిన భర్త, సోమవారం రాత్రి కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన శాంభవిని మంగళవారం కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. భర్త తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.