ధర్మవరం: రైలు కిందపడి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

7చూసినవారు
ధర్మవరం: రైలు కిందపడి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య
గురువారం రాత్రి పట్టణంలోని డీఎస్ఆర్ కాలనీ వద్ద పీఆర్టీ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త అనిల్ (35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం హిందూపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు అనిల్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనిల్ చౌకధాన్యపు డిపో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పుల బాధతో అనిల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్ మృతదేహానికి నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, తెదేపా పట్టణాధ్యక్షుడు సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్