ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం రాజ్యలక్ష్మి (21) అనే యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు, రాజ్యలక్ష్మి పుట్టుకతోనే చెవుడు, మూగ వైకల్యంతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు.