ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన దాసరి కౌసల్య (15) అనే బాలిక గురువారం మధ్యాహ్నం స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు 9701586388 లేదా 6305800429 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.