ధర్మవరం పట్టణానికి చెందిన మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ కో-కన్వీనర్ కడపల సుధాకర్ రెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించిన
మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా
చిరంజీవి చేతుల మీదుగా షీల్డ్ అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని సుధాకర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. చిరంజీవితో ఐదు నిమిషాల పాటు మాట్లాడిన ఆయన, ఈ భేటీ తనకు ఎంతో ప్రత్యేకమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.