ధర్మవరంలోని సిద్ధయ్యగుట్టకు చెందిన
లోకేశ్ వర్మ (32) అప్పుల బాధ, అనారోగ్యం కారణంగా తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు 1-టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మృతుడు కియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, గత రెండేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ పుట్టపర్తిలో వైద్యం చేయించుకుంటున్నాడని సీఐ పేర్కొన్నారు.