ధర్మవరంలోని కేశవ నగర్ సచివాలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు బీరువా తలుపులు పగలగొట్టి ల్యాప్‌టాప్, ఫైల్స్ ఎత్తుకెళ్లారు. అదనపు ఎస్పీ అంకిత సురానా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో ఇన్‌ఛార్జ్ డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రెడ్డప్ప, ఎస్సై ఉమాదేవి కూడా పాల్గొన్నారు.