ధర్మవరం పట్టణంలోని రేగాటపల్లి గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మరణించాడు. మృతుడి వయసు సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే, ధర్మవరం పోలీసులను సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.