శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 'ది కిండర్ ఐలాండ్ ప్రీ స్కూల్'లో బుధవారం నేషనల్ డాక్టర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆస్పత్రుల్లో వైద్యులు చేసే వైద్య విధానాలను స్కూల్లోని చిన్నారులకు నిర్వాహకులు చేసి చూపించారు. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా, వైద్యులు అందించే సేవలు, వైద్యం గురించి చిన్నారులకు అవగాహన కల్పించారు.