శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, డ్రోన్ల సహాయంతో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. రథోత్సవ మార్గాలు, దేవాలయ పరిసరాలు, జనసమ్మర్థ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. అనుమానాస్పద పరిస్థితులను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.