ధర్మవరం లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

2092చూసినవారు
ధర్మవరం లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ధర్మవరం మండలం గొట్లురు గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణస్వామి కుమారుడు, 6వ తరగతి చదువుతున్న వెంకీ (12) తన స్నేహితులతో కలిసి గ్రామంలోని బావిలో ఈతకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు, వెంకీకి ఈత సరిగా రాకపోవడంతో బావిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్