ముదిగుబ్బ మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టోపీ సాబ్ (58) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో క్షతగాత్రుడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.