శ్వేతపత్రం విడుదల చేయాలి.. బీఎస్పీ

0చూసినవారు
శ్వేతపత్రం  విడుదల చేయాలి.. బీఎస్పీ
ధర్మవరంలో పాత 104 వాహనాలకు కొత్త స్టిక్కర్లు వేసి ప్రారంభించడంపై బీఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు వెల్లడించాలని శనివారం డిమాండ్ చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఫోటోలను వాహనాలపై ముద్రించి ప్రచారం చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2023లోనే కొనుగోలు చేసిన ఈ వాహనాలను గత ప్రభుత్వం షెడ్లకే ఎందుకు పరిమితం చేసిందో, నేటి కూటమి ప్రభుత్వం రంగులు మార్చి ఎందుకు మోసం చేస్తోందో ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని, ఈ అంశంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్