ధర్మవరం పట్టణంలో సోమవారం రాత్రి భర్తతో గొడవపడిన భార్య పావని, కత్తితో తన గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణమని పోలీసులు నిర్ధారించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.