ధర్మవరంలో ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి

1569చూసినవారు
ధర్మవరంలో ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి
శుక్రవారం రాత్రి ధర్మవరంలోని మార్కెట్ వీధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిల్వంపల్లి గ్రామానికి చెందిన రామలింగమ్మ అనే మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Job Suitcase

Jobs near you