
ప్రయాణికులతో గుంతకల్లు రైల్వే జంక్షన్ కిటకిట
గుంతకల్లు రైల్వే జంక్షన్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా మారింది. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలులో, డోర్ లోపలి నుంచి లాక్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


































