గుంతకల్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుంతకల్ ఆర్డీవో శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ ఎస్. హరి ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, గుంతకల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలలో పారిశుధ్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ కూడా చల్లడం లేదని, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల జబ్బుల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.