గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, బీఎల్ఓలకు సర్ (SIR) కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం చెట్నేపల్లిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఓటరు జాబితాలను పరిశీలించారు. జూలై 15 లోపు ప్రక్రియను పూర్తి చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా సర్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.