విడపనకల్లు మండలం ఎన్. తిమ్మాపురంలో మంగళవారం మట్టిని తరలిస్తున్న టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన డ్రైవర్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ నెలలో మట్టి టిప్పర్ బోల్తా పడటం ఇది రెండోసారి. మద్యం మత్తులో డ్రైవర్లు టిప్పర్లను నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.