
గుత్తిలో స్థల వివాదం ఘటన లో 41 మందిపై కేసు
గుత్తిలో బుధవారం స్థలం విషయంలో వాసు, గోవర్ధన్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గోవర్ధన్ వర్గం వాసు ఏర్పాటు చేసిన స్థలం హద్దులను తొలగించడంతో వాసు దాడికి యత్నించారు. అనంతరం గోవర్ధన్ వర్గం వాసు ఇంటిపై, కారుపై దాడి చేసింది. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం 41 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.






























