
సంక్రాంతి పండుగ సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ
గుత్తి పట్టణం మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం, ఆర్ఎస్ లోని హనుమాన్ టెంపుల్, వాసవి మాత, అయ్యప్ప స్వామి, శివ భక్తులు, కనకదుర్గమ్మ దేవాలయం, గౌతమేశ్వరాలయం, బాట సుంకులమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు, హారతులు చేశారు. పండుగ సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.


































