గుంతకల్లు - Guntakal

మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో శుక్రవారం, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు మాట్లాడుతూ, నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్, యువగళం పాదయాత్రతో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని పేర్కొన్నారు. లోకేష్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, "జై నారా లోకేష్, నారా చంద్రబాబు, జై గుమ్మనూరు" అంటూ నినాదాలు చేశారు. అనంతరం కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా