హిందూపురం రూరల్ మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.