సత్య సాయి: వాలంటీర్ పనుల బహిష్కరణ.. సచివాలయ ఉద్యోగులు ఆందోళన

2421చూసినవారు
సత్య సాయి: వాలంటీర్ పనుల బహిష్కరణ.. సచివాలయ ఉద్యోగులు ఆందోళన
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ సెక్రటరీలు, రాష్ట్ర Gsws JAC పిలుపు మేరకు ఇంటింటి సర్వేలు, వాలంటీర్ పనులను బహిష్కరించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పష్టమైన జాబ్ చార్ట్, మాతృ శాఖలో విలీనం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరుతున్నారు. వాలంటీర్ విధులు, క్లస్టర్ మ్యాపింగ్ విధానం, సర్వేల పేరుతో అధిక పని ఒత్తిడి పెంచుతూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా, దివ్యాంగ ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పునరాలోచించి, న్యాయమైన పరిష్కారం చూపాలని శనివారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్