కొత్తచెరువు పట్టణంలో పాల రామాంజనేయులు (44) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మారుతి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం వెలుగు చూసింది.