చిలమత్తూరు: ‘శ్మశానానికి దారి చూపండి'

300చూసినవారు
చిలమత్తూరు మండలం కొర్లకుంట ఎస్సీ కాలనీవాసులకు శ్మశానానికి దారి చూపాలని ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సాకే హరి ఆదివారం డిమాండ్ చేశారు. కొర్లకుంట ఎస్సీ కాలనీలో గంగేసమ్మ అనే వృద్ధ మహిళ మరణించగా శ్మశానానికి దారి లేక అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో శవంతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొర్లకుంటలో శ్మశానానికి దారి చూపాలని సాకే హరి కోరారు.

సంబంధిత పోస్ట్