గుడిబండ మండలం మోరుబాగలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామలింగప్ప అనారోగ్యంతో మరణించారు. దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. రామలింగప్ప మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.