ఈ నెల 10వ తేదీన అనంతపురంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శుక్రవారం పర్యవేక్షించారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బహిరంగ సభ స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బహిరంగ సభకు తరలివచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీకే పార్థసారథి తెలిపారు.