హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ అధ్యక్షతన శనివారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధి, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతకుముందు, జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ చీటీల విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.