గ్రామీణ మండలం సడ్లపల్లి
ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రజల్రెడ్డి అనే యువకుడు ఫోన్ వ్యసనానికి బానిసై, తల్లిదండ్రులు మందలించడంతో మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం వరకు ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రైల్వేస్టేషన్లో ఉన్న యువకుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తుపై దృష్టి సారించాలని సీఐ సూచించారు.