హిందూపురం: తూముకుంట ఎస్బిఐ బ్రాంచ్ దోపిడీ కేసు ఛేదింపు

హిందూపురం రూరల్ పరిధిలోని తూముకుంట చెక్పోస్ట్ సమీపంలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ బ్యాంకులో జూలై 26న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ, హిందూపురం డిఎస్పీ కేవీ మహేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్ చేయడంతో పాటు, 2 కోట్ల రూపాయల విలువైన రెండు కేజీల బంగారు ఆభరణాలు, ఒక కారు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
