సత్యసాయి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం

2247చూసినవారు
సత్యసాయి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం
సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలంలోని దామాజిపల్లి వద్ద భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఐషర్ వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, మరో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న బస్సులో మొత్తం పలువురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.