శ్రీ కంఠపురం చెరువు మురికి కూపంగా మారింది

3587చూసినవారు
హిందూపురం పట్టణానికి రిజర్వాయర్ లాంటి శ్రీ కంఠపురం చెరువు ఇటీవల కాలంలో మురికి కూపంగా మారింది. డి ఆర్ కాలనీ, రాజరాజేశ్వరి కాలనీ, మోడల్ కాలనీ, పూలమతి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలనీలలోని వ్యర్థపు నీరు, మరుగుదొడ్ల నీరు, చికెన్ వ్యర్థాలు చెరువులోకి చేరుతున్నాయి. దీంతో చెరువు పిచ్చి మొక్కలతో పాటు డ్రైనేజీ నీటితో కంపు కొడుతూ దుర్వాసన వెదజల్లుతోంది.