శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని కోడిపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మించారు. వెళ్లే దారిలో ఇబ్బందిగా ఉందని గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు సోమవారం వెంటనే స్పందించిన స్థానిక ఎంపిటిసి గంగాధర్, సీనియర్ నాయకులు రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా వారే వెళ్ళి సిమెంట్ కాంక్రీటు వేసి ఆ సమస్యను తీర్చడం జరిగింది. వీరికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.