వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల వేట

1187చూసినవారు
వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల వేట
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని మాదిరెడ్డిపల్లి వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంతకుముందు ఇక్కడ ఎవరో తవ్వకాలు చేశారని 15 రోజులు నుంచి తాను తవ్వకాలకు ప్రయత్నిస్తున్నాని ఇంతలో దొరికిపోయినట్టు నిందితుడు తెలిపాడు. తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా అతను తిరుపతికి చెందినవాడిగా చెప్పాడు.