లేపాక్షి మండలం నాయనపల్లి క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తహేరా బేగం అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాబా ఫక్రుద్దీన్, తహేరా బేగం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన తహేరా బేగంను ఎన్హెచ్ అంబులెన్స్ సిబ్బంది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.