భువనేశ్వర్ నుంచి మైసూరుకు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన రంజిత్ ముండా, హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుకొండ షీప్ ఫామ్ సమీపంలోని అడవిలో రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. మృతుని బంధువులు అతన్ని గుర్తించి, ఒడిశాలోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.