కదిరి - Kadiri

వీడియోలు


కామారెడ్డి జిల్లా
Dec 13, 2025, 06:12 IST/

సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు

Dec 13, 2025, 06:12 IST
TG: రైపు (ఆదివారం) గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థుల ఆస్తులపై దాడులు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి ఇంటి బయట మంటలు గమనించిన నర్సయ్య వెంటనే బయటికి వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే కారు సగానికి పైగా దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.