ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓదులపల్లి పంచాయతీ దాంపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వేణుగోపాల్ చేపలు పట్టేందుకు కాలువలోకి దిగి నీటిలో కొట్టుకుపోయి మరణించినట్లు తెలిపారు.